మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంటి గేట్ దూకి వాష్ ఏరియాలో ఉన్నటువంటి నల్లాలు దొంగిలించాడని యజమాని తెలిపారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిల్లర దొంగలు నల్లాలు కూడా వదలడం లేదని స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.