డ్రైవర్ నిద్రపోవడంతో లారీ పల్టీ..ఇద్దరి ప‌రిస్థితి విషమం

మేడ్చల్: లారీ డ్రైవర్ నిద్రపోవడంతో లారీ పల్టీ కొట్టి ఔటర్ రింగురోడ్డుపై నుంచి కిందపడిన ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుజరాత్ నుంచి నెల్లూరుకు ప్రయాణిస్తున్న ఓ లారీ.. డ్రైవర్ నిద్రపోవడంతో పల్టీ కొట్టి కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయాలైన డ్రైవర్ సోహెల్, క్లీనర్ సాహిద్‌ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్