మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వల్లి గ్రామంలో వికారాబాద్ కు చెందిన లక్ష్మి (50) రేకుల రూంలో నివాసం ఉంటుంది. స్థానికంగా రోజు వారి కూలీగా ఓ వైన్స్ లో పని చేస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున రేకుల రూంలో నుండి పొగలు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులకు సగం కాలిన మృతదేహం లభ్యం అయింది.

సంబంధిత పోస్ట్