జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌దేనని తేల్చి చెప్పింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే కేంద్రాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తామని హైకర్టు హెచ్చరించింది.