కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పిఎస్ రామ్ రెడ్డి నగర్ లో కల్లు దుకాణంలో కల్లు నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు సేవించారు. గాజుల రామారం లో నివసిస్తున్న కూతురు రేఖ ఇంటికి లచ్చిరాం, సాక్రిభాయ్ అనే దంపతులు వచ్చారు. కల్లు దుకాణంలో నిన్న సాయంత్రం లచ్చిరాం దంపతులు కల్లు సేవించారు. కల్లు తాగినప్పుటీ నుండి కాళ్ళు చేతులు లాగడం, పిచ్చిగా ప్రవర్తించడంతో ఉదయాన్నే 108ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు.