కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పీయస్ పరిధిలోని అయ్యప్ప కాలనీలోని బుధవారం ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దగ్యాస్ సిలిండర్ ల నుండి చిన్న సిలిండర్ లలో రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ లు పేలాయి. పక్కనే ఉన్న పంచర్ షాప్ తో పాటు మరో దుకాణానికి మంటలు అలుముకున్నాయి. ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పేసిన ఫైర్ సిబ్బంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.