శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాళ్ళగుడా వద్ద మారుతి బెలునో, మహీంద్రా ఎక్స్‌యువి700 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.