హైదరాబాద్‌లో 4 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవ్వడం కలకలం రేపింది. ఈరోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో 'న్యూ పబ్లిక్ స్కూల్' సమీపంలో ఒక మహిళతో ఉన్న బాలుడు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు, ప్రజాప్రతినిధులు టప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.