శుక్రవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం (6ఈ717) హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా బెంగళూరుకు దారి మళ్లించబడింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఈ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.