హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం గుడిసెల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుడిసెలు కాలి బూడిదయ్యాయి. స్థానికులు బకెట్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.