పైప్‌లైన్ లీకేజీతో వృథా అవుతున్న మంచినీరు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని కాటేడాన్ డివిజన్, ప్రగతి కాలనీ నుంచి బృందావన్ కాలనీ వరకు మంచినీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా ప్రతిరోజూ మంచినీరు వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు జలమండలి అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నీటి సరఫరా జరిగే ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని పేర్కొన్నారు. లీకేజీని వెంటనే గుర్తించి, మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అరికట్టాలని బీజేపీ కాటేడాన్ డివిజన్ అధ్యక్షుడు గోదా పాండు యాదవ్ జలమండలి అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్