ఆదర్శ కాలనీలో శ్రీ వక్రతుండ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాలనీకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, అసోసియేషన్ సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.