రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ టీ ఎన్జీవోస్ కాలనీలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలంపాటలో పోతు రంజిత్ కుమార్ రూ. 21,516లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు రంజిత్ కుమార్ను ఘనంగా సత్కరించారు. లడ్డూను వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉందని రంజిత్ కుమార్ తెలిపారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.