గంజాయి తరలిస్తున్న భార్యాభర్త అరెస్టు

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో పోలీసులు 2 కేజీల‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుండి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న భార్యాభర్తలను శుక్రవారం అరెస్ట్ చేశారు. అత్తాపూర్ లో గత కొంత కాలంగా చిన్న చిన్న ప్యాకెట్స్ లో గంజాయి ప్యాకింగ్ చేసి భార్య భర్తలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్