హైదరాబాద్: వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళ వరకట్న వేధింపులు తాళలేక శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన అమ్రేష్ తో స్వప్నకు 2022లో వివాహమైంది. కాగా, కొంతకాలం నుంచి అదనపు కట్నం కోసం అమ్రేష్ వేధిస్తున్నాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వప్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్