కేసీఆర్ పాలనకే ప్రజలు జై కొడతారు: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలనకు ముగింపు పలికి, పునర్నిర్మాణం జరగాలంటే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శంషాబాద్ మండలం ముంచింతల్ గ్రామంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వీరి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్