రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ రెడ్డి బస్తీలో బెట్టింగ్ యాప్ తో మరో విద్యార్థి బలయ్యాడు. మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో పవన్ ఎమ్ టెక్ చదువుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ కు పాల్పడిన పవన్ ఒకే సారి 1లక్ష రూపాయలు పోగొట్టుకోవడంతో తన వద్ద ఉన్న ఐఫోన్, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అమ్ముకొని బెట్టింగ్ చేశాడు. తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం పవన్ బెట్టింగ్ లో పెట్టాడు. ఒక్క రూపాయి కూడా లాభం రాకపోవడంతో తీవ్ర మనస్థాపం ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.