రాజేంద్రనగర్: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. మేము విశ్వసనీయమైన పాకిస్తాన్ స్లీపర్ సెల్స్. ఏ క్షణమైనా బాంబుతో ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తాం అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఫిర్యాదు మేరకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్