గురు పూర్ణిమ సందర్బంగా రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో గణేష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణేష్ నగర్ స్థానిక నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు మాణిక్యం, వి. జె. లక్ష్మి బాయ్, టీ. మద్దిలేట్టి, ఎస్. విజయలక్ష్మి, డి. జ్యోష్ప, బి. శిరీష లను సత్కరించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ గురు పూర్ణిమ రోజున విద్యను పంచే ఉపాధ్యాయులను గుర్తించి ఇలా గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు.