మహిళల ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్యల ప్రధాన లక్ష్యమని సమాఖ్య అధ్యక్షురాలు ఆకుల జ్యోతి, ఆర్‌పీ కీలుగు హేమలత తెలిపారు. మంగళవారం బాబుల్ రెడ్డి నగర్‌లో జరిగిన "ఇందిరా మహిళాశక్తి తెలంగాణ సంబరాలు" కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బ్యాంకు రుణాలు, బీమా, నూతన సంఘాల ఏర్పాటు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.