రాజేంద్రనగర్ లో వరుస దొంగతనాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు మహిళలు ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న భవనాల్లోని కేబుల్, ఎలక్ట్రికల్ వైర్లను దొంగిలించేందుకు ప్రయత్నించారు. గేటు పగలగొట్టి లోపలికి వెళ్లి వైర్లు దొంగిలించే ప్రయత్నం విఫలమవడంతో, పక్కనే ఉన్న మరో భవనంలో వైర్లను దొంగిలించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నమోదైంది. భవన యజమానులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 20 రోజుల్లో ఇలాంటి చోరీకి రెండోసారి ప్రయత్నించారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యజమానులు కోరారు.

సంబంధిత పోస్ట్