శివనామ స్మరణతో కిటకిటలాడిన దేవాలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సూర్యోదయానికి ముందే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని, దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించుకున్నారు. 'జై శ్రీరామ్, జై హనుమాన్' నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్