ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ. నూతన దేవాలయ పునర్నిర్మాణం కార్యక్రమాన్ని స్థానిక బిజెపి నాయకుడు ఏనుగుల తిరుపతి ఆహ్వానం మేరకు శ్రీ సాంబశివ దేవాలయం రెండో రోజు ఉత్సవాలకు హాజరు కావడం జరిగిందని వారు తెలిపారు. రెండవ రోజు ప్రత్యేకమైన హోమాలు, అభిషేకాలు, యజ్ఞాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి బిజెపి ఎప్పుడు సహకరిస్తుందని, రాబోయే రోజుల్లో ఓల్డ్ బోయిన్పల్లిలో అతిపెద్ద టెంపుల్ గా మా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య అతిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్, బిజెపి నాయకులు మోహన్, స్వామి, రాకేష్, మధు, బబ్లు, కార్తీక్, అజయ్, బల్బీర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.