నగరంలో కిలేడీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్నారు. వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్నారు. కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్మెయిల్ చేయడం గమనార్హం. ఇలా సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ నుంచి యువతి రూ. లక్ష కొట్టేసింది. మరొకరిని మోసం చేయబోయి పోలీసులకు చిక్కింది. అపరిచితుల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి.