సికింద్రాబాద్: సీఐ దురుసు ప్రవర్తన.. నెటిజన్ల ఆగ్రహం

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద ఓ వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ చేయి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోటల్ ముందు వాహనాలు పార్క్ చేశారన్న కారణంగా సీఐ హోటల్ సూపర్వైజర్ను ప్రశ్నించి, అతడిని కొట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు వేయాల్సిందే కానీ, చట్టాన్ని అధికారి చేతిలోకి తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్