తుకారాంగేట్: బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు

తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ(50) ఈనెల 1న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వారికి తెలిసిన వారిని, బంధువులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్ రెడ్డి శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్