చిలకలగూడ: గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళా డెడ్‌బాడీ

గాంధీ ఆస్పత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీలో వెయిటింగ్ హాల్ సమీపంలో పడి ఉన్న మహిళ (దాదాపు 55-60) మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్‌బాడీ వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో మార్చురీకి తరలించి భద్రపరిచారు. మృతురాలు యాచకురాలిగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్