చిలకలగూడ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి(52)ని పోలీసులు అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి సదరు వ్యక్తి చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. ఫొటోలోని వ్యక్తిని గుర్తుపట్టిన వారు పీఎస్ లో తెలపాలని పోలీసులు కోరారు.