గచ్చిబౌలిలోని ఓ ఫర్టిలిటీ సెంటర్‌లో 29 ఏళ్ల పల్లవి అనే మహిళ మృతిచెందడం బుధవారం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాకు చెందిన పల్లవికి గర్భసంచిలో నీటి బుడగలు (PCOD) ఉన్నాయని ఫర్టిలిటీ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని హాస్పిటల్ యాజమాన్యం పల్లవి కుటుంబ సభ్యుల నుండి బిల్లు వసూలు చేసింది. అయితే, కొద్దిసేపటికే పల్లవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.