రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ల్యాంకో హిల్స్ లో ఆదివారం సెక్యూరిటీ సిబ్బందిపై దాడి జరిగింది. ఫ్లాట్ 3LH-703 లో నివాసం ఉంటున్న మురళి, బయటకు వెళ్లే సమయంలో వాహనంపై రిజిస్ట్రేషన్ స్టిక్కర్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది విజిటర్ లైన్ ను వినియోగించమని సూచించారు. దీనితో ఆగ్రహించిన మురళి, సాయంత్రం సుమారు 30 మందితో వచ్చి సెక్యూరిటీ సిబ్బంది బాలకృష్ణ, మేనేజర్ అవనగంటి చంద్రయ్యపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ల్యాంకో హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.