హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం రేవంత్ సలహా ఇస్తున్నారని, కాళేశ్వరంతోపాటు హరీశ్‌పై ఉన్నంత పగ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌కు లేదని తెలిపారు. కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కైయ్యారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.