శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ వివేకానందనగర్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ నిర్వహించారు. జిల్లా గణేష్, నేత కుమార్ యాదవ్, అమరేష్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కి నివాళులర్పించి, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలనే డిమాండ్‌తో వివేకానందనగర్ (ఎన్.హెచ్. 65) మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.