మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్స్, సొసైటీ ఆఫ్ న్యూరోక్రిటికల్ కేర్ సంయుక్తంగా 'బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గాన్ డొనేషన్' అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఐసియు డైరెక్టర్ డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్ మాట్లాడుతూ దేశంలో అవయవదానంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య అని చెప్పారు. అవయవదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.