అంగన్వాడీ కేంద్రంలో బాలల విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహణ

మైలార్‌దేవ్ పల్లి సెక్టార్‌లోని బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ కేంద్రం–2లో శనివారం ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డేను అంగన్వాడీ టీచర్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రథమ్ ఎన్‌జీఓ మాస్టర్ ట్రైనర్ హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అక్టోబర్ నెల సిలబస్‌లో నేర్చుకున్న విషయాలను తమ తల్లులకు ప్రదర్శించారు. పిల్లలకు ఇంటివద్ద ఎలా నేర్పించాలో తల్లులకు మార్గదర్శనం చేశారు. పిల్లలు పాటలు, కథలు, మ్యూజిక్ బాల్స్, కలర్ స్టిక్స్ వంటి ఆక్టివిటీలను ప్రదర్శించి ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమాలు పిల్లల్లో ఆలోచన, పరిశీలన, నైపుణ్యాలను పెంపొందిస్తాయని టీచర్ అనిత తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, తల్లులు, శ్రీనివాస్ గుప్త, హెల్పర్ సంగీత, ఇతర టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్