ఎదిగే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు: మంత్రి పొన్నం

తెలంగాణ నుంచి సివిల్స్ పరీక్షల్లో అత్యధిక ర్యాంకులు సాధించాలని ఆశావాహులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచనతో సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారికి 'రాజీవ్ అభయ హస్తం' పేరుతో ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిల్‌లో 100 మందికిపైగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు మోటివేషనల్ థీమ్ సాంగ్‌ను విడుదల చేశామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్