హైదరాబాద్‌లోని యాపూర్‌లో డ్రగ్స్ విక్రయాలు కలకలం సృష్టించాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన మియాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు, డ్రగ్స్ వినియోగిస్తున్న మహేష్, ఆదర్శ్ అనే ముగ్గురు సాఫ్ట్‌వేర్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 12.6 గ్రాముల MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.