హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని చౌమన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్‌లో కుళ్లిపోయిన మాంసం, చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన సాస్ ప్యాకెట్లు గుర్తించారు. కిచెన్ రూం అపరిశుభ్రంగా, కీటకాలతో నిండి ఉందని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అతిక్రమించినందుకు రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు.