గచ్చిబౌలి: కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు

గచ్చిబౌలిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ కానిస్టేబుల్‌పై కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, నిందితుడు కారు వేగంగా పోనిచ్చి ఆయనపైకి దూసుకెళ్లాడు. స్థానికుల సహాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో ఆల్కహాల్ శాతం పరిమితికి మించి నమోదైంది. నిందితుడిపై హత్యాయత్నం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్