గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్ సమీపంలో శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు గ్యాంగ్ వార్ కు దిగారు. చిన్నపాటి ఘర్షణతో మొదలైన ఈ గొడవ రోడ్డెక్కి ట్రాఫిక్ ను భారీగా స్తంభింపజేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను అదుపులోకి తీసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.