రాయదుర్గంలో కొత్తగా నిర్మించిన కట్టమైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు నల్లపోచమ్మ గుడి నుంచి రాయదుర్గం కట్టమైసమ్మ గుడి వరకు మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి విగ్రహంతో శోభాయమానమైన ఊరేగింపును నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు గణపతి పూజ, మండప పూజ, వివిధ రకాల హోమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం కూడా శయ్యాది వాసం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.