కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని, బీఆర్ఎస్ రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రుణమాఫీ చేయలేదని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిందని, కేసీఆర్ పంట బోనస్ హామీ నెరవేర్చలేదని ఆమె పేర్కొన్నారు.