గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి హైటెన్షన్ పోల్‌పై ఎక్కి హల్‌చల్ చేశాడు. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.