ఆసుపత్రిలో చోరీ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు

మదీనగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ శివాజీ నగర్‌కు చెందిన జె. దుర్గ (45) అనే మహిళ అదే ఆసుపత్రిలో హౌజ్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తూ, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. గత నెల ఫిబ్రవరి 25న, చందానగర్ అపర్ణ హిల్ పార్క్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో ఆమెపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్