రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరై శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ వినాయకుడిని దర్శించుకుని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులు కలగాలని ప్రార్థించారు. అనంతరం మండప నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత, భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.