కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఇందిరమ్మ ఇళ్లపై సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, లేదంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ఉద్దేశించి, 'మీకంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే, మీరు పోటీకి దూరంగా ఉంటారా?' అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్