రంగారెడ్డి జిల్లా చందానగర్ లో గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల భారీ వర్షానికి రైల్వే అండర్ పాసింగ్ స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వర్షం కురిసినప్పుడల్లా ఇలాంటి సమస్యలు పునారావృతం అవుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే చర్వతీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.