నారాయణ్ ఖేడ్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సంక్రాంతి సంబరాలు

నారాయణ్ ఖేడ్  పాలిటెక్నిక్ కాలేజ్‌లో సంక్రాంతి పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థినులు బోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రత్యేకతను ప్రతిబింబించేలా సంప్రదాయ ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థిని గాయత్రి వేసిన ముగ్గు ప్రత్యేక ప్రశంసలు పొందింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్