మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనాల్లోని విద్యుత్ తీగలను దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు లక్షల విలువైన 81 బేండల్ విద్యుత్ వైర్లు, ఒక మారుతి స్విఫ్ట్ కారు, బజాజ్ పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మియాపూర్ ఏసీపీ తెలిపారు.