శేరిలింగంపల్లి నియోజకవర్గ బీసీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ బంద్ జరిగింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఖాజాగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, సిబ్బందిని కలిసి బంద్‌కు మద్దతు కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతోందని, అందువల్ల పాఠశాలకు సెలవు ప్రకటించాలని ఆయన కోరారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.