మాదాపూర్ లో డివైడర్ ను ఢీకొని ఇద్దరు మృతి

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సాఫ్ట్ వెర్ ఉద్యోగి అయిన ఆకాంష్(24) అతని స్నేహితుడు రఘు బాబుతో కలిసి బోరాబండ నుండి మాదాపూర్ వెళ్తుండగా ఘటన జరిగింది. బైకు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానం. ఒకరు మృతి చెందగా మరొకరు హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్